ఒక దేశ ప్రధాని గా ఉండటం అంటే అనంతమైన బాధ్యతల బరువు మోయటం. కోవిడ్ వ్యాప్తి తొలిదశ నియంత్రణలో నంబర్ వన్ గా పిలిచిన దేశం న్యూజిలాండ్ ఆ దేశానికి ఆ పేరు తెచ్చింది ప్రధాని జెసిండా. ఈ మహిళా ప్రధాని తాను ప్రేమించిన వ్యక్తితో మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు వారికి రెండు సంవత్సరాల అమ్మాయి కూడా ఉంది. ఇంతవరకు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు ఆమె అనాధి కార భర్త క్లార్క్ గేఫోర్డ్ టెలివిజన్ గా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం వాళ్లు పెళ్లాడాలని అనుకున్నారు కానీ హఠాత్తుగా ఆ దేశంలో కేసులు పెరిగి పెళ్ళిళ్ళు ఆపేయమని ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది అలా ఉత్తర్వులు జారీ చేశాక, మేం కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు అంటూ ప్రధాని జెసిండా ప్రకటించారు. 2019 లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. చర్చి లో పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ మరికొంత కాలం ఆగక తప్పదు అని పెళ్లి వాయిదా వేశారు జేసిండా.
Categories