Categories
ఇంట్లోనే కొన్ని మొలకలు పెంచుకోవచ్చు. చిలగడదుంప చాలా అందమైన తీగలా ఎదుగుతుంది. అలాగే అల్లం,ఉల్లి పాయలు కూడా పెంచుకోవటం సులభమే. చిలకడదుంపలు, బంగాళా దుంపలు కాస్తా పాడైతే దాన్ని పారేయకుందా సగానికి కోసి తరిగిన వైపు నిళ్ళలో ఉండేలా ఒక గ్లాసులో పడేస్తే చాలు, రెండు రోజులకొకసారి నీళ్ళు మారుస్తూ ఉంటే మొలకలు వస్తాయి. అప్పుడు కాస్తా మట్టిపోసి పెడితే ఇంట్లో అందమైన తీగల్ని చూడోచ్చు. వెల్లుల్లిని నేరుగా ఒక రెబ్బ తీసీ మట్టిలో పాతెస్తే మొలకలు వస్తాయి. అలాగే అల్లం ముక్కను ఒక రాత్రంతా గోరు వెచ్చని నీళ్ళలో నానబెడితే దాని చుట్టు మొలకలు వస్తాయి. అప్పుడు ఎండపడే చోట దాన్ని పాతేస్తే అల్లం చక్కగా పెరుగుతుంది.