అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే పోషకాలు పంట పండినట్లేనని లోపల మంచి రంగు ఉండే పండ్ల పెంపకం పై దృష్టిపెట్టారు రైతులు. మౌంటెన్ రోజ్ యాపిల్ కొరికి చుస్తే గులాబీ రంగులోనో ఎర్రగానో ఉంటుంది. క్యారెట్ ,బననా అయితే నారింజ రంగు గుజ్జు ఉంటుంది.ఇందులో బీటా కెరోటిన్లు వంద రెట్లు ఎక్కువ. అలాగే అనోనా రెటిక్యూ లేటా ,సీతా ఫలం మొత్తం పండు గుజ్జు రెండు ఎరుపే. మామే సపోటా లో కూడా ఎరుపు రంగు గుజ్జె.చెంబరాతి చెక్క లేదా చంద్ర హలసు పేరుతొ వుండే బ్లడ్ ఆరంజస్ ,ఆరెంజ్ గ్లో పేరుతో నారింజ పసుపు రంగుగల పుచ్చ ఇలా పండ్లే కాదు రకరకాల వాల్ నట్స్ కూడా రంగు మారిపోతున్నాయి. మరి రంగుల్లో పోషకాలుంటాయని డాక్టర్లు చెప్పేసారు కదా .
Categories