
మోనికా యాదవ్. అహ్మదాబాద్ ఊబర్ క్యాబ్స్ లో తోలి మహిళా డ్రైవర్. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ చేస్తోంది. ఆర్కిటెక్ట్ గా ఐదారు నెలలు పనిచేసి బోర్ కొట్టి వదిలేసి చాలా రోజులు ఆలోచించి క్యాబ్ డ్రైవర్ తనకు పర్ఫెక్ట్ జాబ్ అని నిర్ణయించుకొందిట. అహ్మదాబాద్ లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళింది. ఆడపిల్లకి ఇవ్వం అన్నారట. సరాసరి ఊబర్ క్యాబ్స్ ని అప్రోచ్ అయిందట. రెజ్యూమె చూసి ఈమె ఇంటరెస్ట్ చూసి హ్యాపీ అయిపోయి జాబ్ ఇచ్చేసారు. గుజరాత్ లో ఫస్ట్ ఫిమేల్ టాక్సీ డ్రైవర్ ఈమె. ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు టిప్స్ చూసుకుని సాయంత్రం కాలేజీ కి వెళ్ళిపోతోంది. హెక్టిక్ షెడ్యూలే కానీ ఎంజాయింగ్ జాబ్ అంటోంది. ఆర్కిటెక్ట్ చదివి లోక్లాస్ ఉద్యోగం ఏమిటని కామెంట్స్ వచ్చాయి. నాకు నచ్చాలి నన్ను నేను సమాధాన పరుచుకోవాలి. గానీ ఆడాళ్ళ ఉద్యోగం మగాళ్ల ఉద్యోగం చిన్నది పెద్దదీ లోక్లాస్ హైక్లాస్ అని వుంటుందా ? అంటోందీ అమ్మాయి మోనికా యాదవ్ కి సలహా ఇస్తారా ? కంగ్రాట్స్ చెపుతారా ?