Categories
ఒత్తిడికి చెక్ పెట్టాలంటే మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళవీ,ప్రేమించే వాళ్ళవి ఫోటోలు చూడమంటునారు ఎక్స్ పర్ట్స్. మనసు ఒత్తిడిగా ఉద్రేకంగా లేదా డల్ గా ఉంటే దాన్ని సమర్ధవంతమైన మార్గాల ద్వారా ఎదుర్కోవాలి. ఈ ఒత్తిడికి మొదటలోనే చెక్ పెట్టకపోతే అది కాలం గడిచే కొద్ది ప్రమాదం ఐపోతుంది. దాన్ని ఎదుర్కోనే మార్గల్లో ఒకటి మనకు ఇష్టమైన ఫోటోలు చూస్తూ మనసు నెమ్మది అయ్యేలా చూసుకోవటం ఇది మెదడును ఇబ్బంది పెట్టే విషయాలను నెమ్మదింపచేస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి.మనకు ఒత్తిడిని తగ్గించుకునేందుకు లీవింగ్ రూమ్ లో పడక గదిలో కుటుంబసభ్యుల ఫోటోలు పెట్టుకోవాలి. బ్యాగ్ లోనూ ఉంచుకోవాలి. ఒత్తిడి అనిపించినప్పుడు అవి చూస్తూ ఉండాలి.