Categories
Gagana

ఫిజికల్ అప్పీయరెన్స్ బావుంటే చాలు.

హీరోయిన్లు, హీరోల పర్సనల్ జీవితాలు, వాళ్ళ ఫేషన్లు, వాళ్ళ రిలేషన్స్ ఎప్పుడు ప్రేక్షకులకు సరదానే. రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్ను పెళ్ళాడే వాడు ఏ లక్షణాలతో ఉండాలని అడిగితే, చక్కని హైట్ వుండాలి, అంటే రకుల్ కంటే ఎత్తుగానన్నమాట, ఇంకా రెండోది బాగా తినాలి, వర్క్ వుట్స్ చేయాలి అంటే ఈ లక్షనాలుంటే చాలునంటుంది. అదేమాట, ఇంకా ఆ వరుడు మంచి లక్షణాలతో, అందంగా, మటకారిగా పోనీ కోటేశ్వరుదిగా ఇలా ఏవీ అక్కర లేదా అంటే, రాకుల్ తేలికగా కొట్టి పారేసిందట. అవన్నీ మనకేం తెలుస్తాయి గనుక మన ముందు బాగానే కన్పిస్తారు, లోపల ఎలాంటి వాళ్ళో ఏమనో, అంచేత ఫిజికల్ అప్పియరెన్స్ బావుంటే చాలు అనుకొంటాననేసిందిట. రాకుల్ అందనే కానీ నిజానికి ఎవరైనా ఇంత కంటే ఎక్కువ ఏం ఆశించగలరు.

Leave a comment