Categories
20వ శతాబ్దపు పాశ్చాత్య చిత్రకళా ప్రపంచంలో రారాజు శిల్ప కళాకారుడు ,ప్రింట్ మేకర్ ,కవి,నాటక రచయిత పాబ్లో రూయిజ్ పికాసో . సామజిక రాజకీయ చైతన్యం పికాసో లో చాలా ఎక్కువ . 1937లో వేసిన గౌర్ణిక,లావి,ది ఓల్డ్ గిటారిస్ట్ ,గర్ల్ బిఫోర్ మిర్రర్ ,త్రి మ్యుజిషియన్ వంటివి చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి . ఆఫ్రికన్ కాలం ,నీలవర్ణ కాలం, రోజ్ వర్ణ కాలంవంటి ఏకవర్ణ ప్రయోగాలతో తన చిత్ర విన్యాసంతో నూతన పద్దతుల అన్వేషణకు ప్రేరణ ఇచ్చాడు పికాసో . చిత్రాలలో చేసిన ప్రతి ప్రయోగము ఆయనకు పేరు తెచ్చింది చిత్ర కల ప్రపంచంలో కళాకారులకు ఆరాద్యుడుగా నిలిచాడు పికాసో .