Categories
Soyagam

పిగ్మెంటేషన్ పోగొట్టే వేప నూనె.

వేప నూనె తో ఎన్ని ఉపయోగాలున్నాయో చుస్తే ఇన్నాళ్ళు దీన్ని వాడకుండా ఎందుకున్నామో అనిపిస్తుంది. సాధారణంగా వేప నూనె మొక్కలకు క్రిమి సంహారిని అని మాత్రం అనుకుంటే పొరపాటే. కొందరికి పదాల్లో పగుళ్ళు వస్తాయి. అలంటి వాళ్ళు వేప నూనె లో కాస్త పసుపు కలిపి పాదాలకు రాసుకోవాలి. అలాగే వేప నూనె హ్యాండ్ సానిటైజర్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఒక స్ప్రే సీసా లో తీసుకుని సింక్ దగ్గర పెట్టుకోవాలి. చేతులు శుభ్రం చేసుకునే ముందు పూర్తిగా వదిలి పోతాయి.  కొందరికి చర్మం నల్లగా మరే పిగ్మెంటేషన్ సమస్య తో బాధ పడుతుంటారు. అలాంటప్పుడు ఆ ప్రాంతం లో వేప నూనె రాసి మర్దన చేసుకుంటే మెలనిన్ తగ్గి పిగ్మంటేషన్ అదుపులోకి వస్తుంది. చివరికి పిల్లల తలల్లో పేలు పడితే కొబ్బరి నూనె లో వేప నూనె కలిపి తలకు పట్టిస్తే పేలు పోతాయి. ఇలా వేప నూనె తో ఎన్నో రోజువారీ ఉపయోగాలున్నాయి.

Leave a comment