మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో పిల్లలకు అబద్దాల వైపు దారి చూపెడుతుంది. ఈ భయన్ని తమ పట్ల గౌరవం అనుకుంటారు పెద్దలు. హోం వర్క్ లేదనో,ఏం పగల కొట్టలేదనో,ఎవర్ని కోట్టలేదనొ తన్నులు తిన్నాకా పిల్లలు మోరపెట్టే మాటలే. మనం పిల్లల ను శిక్షించేది వాళ్ళ బాగు కోసమే అని వారికి అర్ధమయ్యెలా ప్రవర్తించాలి. నిజం చెబితే నాకు ఇష్టం ఒకవేళ తప్పు చేసిన నిజం చెప్పారు గనుక అర్ధం చేసుకుని గౌరవిస్తాను. ఆ తప్పు ఎందుకు చేశారో చెబితే అది కరక్టా కాదా అన్నది ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అన్న భరోసా మనం పిల్లలకు కల్పిస్తే వాళ్ళు అబద్దాలు అడారు. పిల్లలు ఎలా ఉండాలో చెప్పే ముందు మనం ఆచరించి జీవిస్తే వాళ్ళు తప్పే చేయరు ఏమంటారు.
Categories