ఎయిర్ ఫోర్స్ పైలట్ల సాహసాన్ని చూపించే తేజస్ సినిమాలో కంగనా నటిస్తోంది. 43 అడుగుల పొడవున ఉండే తేజస్‌ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎదురుగా పైలట్ యూనిఫామ్ లో నిలబడ్డ కంగనా ఫస్ట్‌ లుక్‌ నెటిజన్లను ఆకట్టుకొంది తేజస్ ఫైటర్ లు మన దేశీయ సాంకేతిక పరిజ్ఞానం తో తయారయ్యాయి ఇంతకు ముందు ఉన్న వింగ్ విమానాలను రీప్లేస్ చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు వీటిని తయారు చేశారు. ప్రస్తుతం మన దగ్గర 35 తేజస్ ఫైటర్లు ఉన్నాయి. మొత్తం 400 లకు పైగా ఈ విమానాలు కావాలని రక్షణ శాఖ యోచిస్తోంది. తేజస్ ఫైటర్ గా ఉండటం అంటే కదన రంగంలో పోరాడాలి. అలాటి పాత్రను కంగనా పోషిస్తోంది.

Leave a comment