ఇల్లు కట్టుకోవాలన్న, బాగు చేసుకోవాలన్న, స్త్రీలకు రుణాలు ఇచ్చే ఏకైక సంస్థ ఎవియోమ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సి ఈ ఓ కాజల్ ఇల్మి. ఇది మా రిలయన్స్ ఎ.పి.ఆర్ డి ఎల్ ఎఫ్ వంటి సంస్థల్లో పని చేశారు. 20 ఏళ్ల పాటు మానవ హక్కుల సంఘాలతో కలిసి పనిచేశారు. ఆడవాళ్లు ఎన్నో సమస్యలకు వాళ్లకు తలదాచుకునే ఇల్లు లేకపోవడమేనని అర్థం చేసుకొని 2016 లో ఈ ఎవియోమ్ సంస్థకు శ్రీకారం చుట్టారు ఇల్లు కట్టుకోవాలన్నా, మరమ్మత్తు చేసుకోవాలన్న 5000 నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. అలాగే టాయ్ లెట్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు 40 వేల మరుగుదొడ్లు నిర్మించారు.ఎవియోమ్ సంస్థ వారు ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ మహిళలే. ఇప్పటివరకు ఎవియోమ్ (AVIOM) 12 రాష్ట్రాల్లో 250 శాఖల తో పని చేస్తుంది.

Leave a comment