ఎన్నో పువ్వులు ఇంటికి తెస్తాం పూజకో అలంకరణకో ఫ్లవర్ వాజ్ లోకో అవి వాడిపోయాక పారేయకుండా కొన్ని చికిత్సల కోసం వాడమంటున్నారు ఎక్స్ పర్ట్స్. గులాబీ పూలు,మందార పూలు , చామంతి,బంతి ఏవైనా సరే ముందుగా ఎండబెట్టాలి. వాటిని విడివిడిగా బాక్స్ ల్లో పెట్టుకోవాలి. అరకప్పు నీళ్ళు మరిగించి అందులో గోద్రెజ్ ఎండిన మందార గులాబీ రేకులు వేసి మూత పెట్టేయాలి.ఆ నీటిని వడకట్టి అందులో కొబ్బరి నూనె మెత్తటి ఉప్పు కలిపి వంటికి పట్టించి ఓ అరగంట ఆగి స్నానం చేస్తే చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది. ఎండిన చామంతి పూలు పొడిలో కొబ్బరి నూనె ఓట్స్ అవిసె గింజలు పొడి కలిపి ఆ మిశ్రమంలో మొహం మెడ రుద్ది గోరు వెచ్చని నీళ్ళలో కడిగితే మృతకణాలు పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment