ముప్పై ఏళ్ళకే సంపన్నుల్లో స్థానం సంపాదించి ఫోర్బ్స్ లో స్థానం సంపాదించిన ఆలియా భట్ ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం ఇష్టం అంటుంది. కేవలం గ్లామర్ పాత్రలో కాకుండా బరువైన పాత్రల్లో కూడ నటించి తనకంటే పెద్ద వాళ్ళ స్థాయికి ఎదిగింది. ఈ విషయం గురించి చెబుతూ నా తల్లిదండ్రులు నన్ను చిన్న పిల్లలా చూడలేదు. పరిపక్వత ఉన్న అమ్మాయిగానే పరిగణిస్తారు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే మన అనుభవమే వయసుని నిర్ణయిస్తుంది. నాకు ఇరవై ఏళ్ళ వయసులో ఆ వయసు అమ్మాయిలా ఆలోచించలేదు. వ్యక్తుల జీవన విధానాన్ని బట్టి వాళ్ళ ఎదుగుదల ఉంటుంది అంటుంది ఆలియాభట్. ఫ్రెంచ్ ఫ్రైస్ కరకర నములుతూ పుస్తకాలు చదవటం, నిద్రపోవటం అంటే ఈమెకు చాలా ఇష్టం.

Leave a comment