Categories
WhatsApp

తరచూ డాక్టర్ ని కలవాల్సిందే.

కొంతమంది పళ్ళు పచ్చగా మరకలు పడినట్లు ఐపోతాయి. తరచూ కాఫీ తాగటం పిజ్జి, డైట్, సిట్రస్ పానీయాలు ఎసిడిక్ గుణాలు కలిగి వుండి తెల్లని పంటి ఎనామిల్ కు హాని కలిగించి లోపల గల ఎల్లో డెంటైన్ ను బయట పడేస్తాయి. కాఫీ కొంత పరిమితం చేసుకోవడం మంచిదే. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగే అలవాటు వుంటే ఇలా పళ్ళు పచ్చిగా వస్తాయి. చినప్పుడు ఎక్కువ ఫ్లోరైడ్ యాంటీ బియోటిక్స్ తీసుకొన్నా ఎదిగాక పంటి రంగు మారిపోవడానికి కారణం అవుతాయి. ఈ మరకలు పోవాలంటే స్రాప్, పాలిష్ కోసం ఏడాదికి రెండుసార్లు డాక్టర్ ను కలుసుకోవాల్సిందే. మార్కెట్ లో వైటనింగ్ ఉత్పత్తులు దోరుకుతాయి కానీ, వీటిలో బరువైన పదార్ధాల కాన్సంట్రేషన్ తక్కువగా వుండి తేడా కనిపించడానికి టైమ్ పడుతుంది.

Leave a comment