కిరణ్ నాడార్ ఎం సి ఎం లో కమ్యూనికేషన్ అండ్ బ్రాండ్స్ ప్రొఫెషనల్ గా కెరియర్ ప్రారంభం చేశారు. హెచ్.సి.ఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ భార్య ఆమె. 2005 లో కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ప్రారంభించారు. ఎంతో ఇష్టంగా కిరణ్ నాడార్ సేకరించిన ఐదు వేల కళాకృతుల తో ఈ మ్యూజియం ప్రారంభమైంది. శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ గా భారత్ ఫ్రెంచ్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల పురోభివృద్ధికి కళల సహకారానికి కృషి చేస్తున్నారు కిరణ్ నాడార్. 2010 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆమెను “హీరో ఆఫ్ ఫిలాంత్రోపి”గా వర్ణించింది.

Leave a comment