Categories
పెళ్ళయిన జంటలు తొలి రోజుల్లో చాలా సుఖంగా సంతోషంగా గడుపుతారని నేటి వరకు నమ్ముతున్నాం. కాని పరిశోధకులు ఎంతో మందిని ఇంటర్యూ చేసి పెళ్ళయిన మూడో సంవత్సరం వరకు కాపురం చాలా మురిపెంగా సాగుతుందంటున్నారు. అప్పటికి దంపతులు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఒకరి లోపాలు ఒకరు భరించే స్థాయిలో ఉంటారు. అక్కడ నుంచి తమ దాంపత్య బంధాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నాలు చేస్తారు. సంసారంలోని ఆర్ధిక సమస్యల పైన ఒక అవగాహన వస్తుంది.ఇక ఐదో ఏడు వచ్చేసరికి పిల్లలు పుట్టడం ,పెరగడం, కాస్త ఖర్చులు పెరగడం ఇంట్లో అదనపు చాకిరీ ఇవన్నింటిలో భార్య భర్తల మధ్య కీచులాటలు మొదలవుతాయట. పరిశోధకులు దంపతులు ఈ విషయంలో శ్రద్దగా చర్చించుకుని జీవితం హాయిగా కొనసాగేలా ప్లాన్ చేసుకోమంటున్నారు.