సుబోధ్ కెర్కర్స్ సృష్టించిన పువ్వులతోటను చుస్తే ఆ రంగుల్ని ఆ ఊహని చుస్తే ఎవ్వరైనా మై మరచిపోతారు. గోవాకు చెందిన వైద్యుడు , కళాకారుడు అయిన సుబోద్ పట్టణంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ గుట్టలుగా పడి ఉండటం చూసారు. గోవా పర్యాటక కేంద్రం ఈ బాటిళ్ళ సమస్య కు పరిష్కారం పట్టణం లోనే చూపించాలి అనుకున్నారు. గోవా లోని బీచ్లు , హోటళ్ళ నుంచి లక్షా 50 వేల ప్లాస్టిక్ బాటిళ్ళు సేకరించి వాటికి రంగులు వేసి పూవుల్లా పూల రేకుల్లా కత్తిరించి గోవా వెళ్ళే దారిలో సోలిగానో గ్రామంలో రోడ్డు పక్కన అచ్చం పూల తోటలా భూమిలో పతాడు దీన్ని చూసేందుకు గోవా వచ్చిన వాళ్ళంతా క్యూలు కట్టారు. ఇన్ని బాటిల్లు పోగుచేసారంటే ఎంత ప్లాస్టిక్ పేరుకు పోయిందో పర్యావరణానికి జీవనానికి మనుగడకు ఎంత ప్రమాదం కలిగిస్తుందో కనీసం దాన్ని చూసి అయినా మనం మారక పోతారా అంటున్నారు డాక్టర్ గారు.
Categories