మనం రోజూ ఇంట్లో వాడే వస్తువులతోనే వాయు కాలుష్యం వస్తుంది అంటున్నారు పరిశోధకులు. దోమలకు వాడే స్ప్రేయర్లు , కాయిల్స్ , షాంపూ , షేవింగ్ క్రీములు , క్లీనింగ్ లోషన్స్ సమస్తం ఇంట్లో మంచి గాలిని పోగొట్టేస్తాయి. కనీసం ఇంట్లో అయినా శుభ్రమైన గాలి పీల్చుకోవాలి అంటే ఇంట్లో ముందర ఎక్సహౌస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో తేనె తుట్టెల మైనం తో చేసిన కొవ్వొత్తులను ఉపయోగించుకుంటే వీటితో తక్కువ కాలుష్యం ఉంటుంది. సాల్ట్ క్రిస్టల్స్ తో తయారు చేసిన సాల్ట్ లంప్స్ కూడా శుభ్రమైన గాలిని ఇస్తాయి. వీటిలో ఉండే శక్తి ఇంట్లో వ్యాపించిన దుమ్ము , సిగరెట్ల పొగ నుంచి కాపాడుతుంది. ఈ లంప్స్ ఇంట్లో వెలిగిస్తే ఆస్తమా , అలర్జీలు మొదలైన సమస్యలు పోతాయి.

Leave a comment