నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని
అడెల్లి గ్రామంలో వెలసిన మహాశక్తి స్వరూపిణి అయిన పోచమ్మ తల్లిని ఈ ఆషాఢమాసంలో తప్పకుండా దర్శనం చేసుకోవాలి.
శివపార్వతుల ముద్దుల తనయ పోచమ్మ ఈ క్షేత్రంలో తన ఏడుగురు అక్క చెళ్ళెళ్ళు బ్రాహ్మణి,మహేశ్వరి,వైష్ణవి,కౌమారి,వారాహి,చాముండి,ఇంద్రాణిలతో కోలువై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీరుస్తోంది.కరువు కాటకాలతో,అనారోగ్యలతో భక్తులు శివుని పూజించిన పోచమ్మను రక్షకురాలిగా ఈ క్షేత్రం లో తండ్రి ఆదేశం మేరకు కొలువై భక్తులను రక్షణ కల్పిస్తోంది.
నవరాత్రుల ముందు పోచమ్మ తల్లికి గంగనీళ్ళ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారి ఆభరణాలను సమీపంలోని గోదావరి నది తీరాన ప్రక్షాళన చేసి,వెండి బిందెతో గోదావరి జలంతో పోచమ్మ విగ్రహాన్ని శుద్ధి చేసి ఆ నీళ్ళను పంటపొలాలలో చల్లుకుంటారు.పోచమ్మ త్రిశూలం,ఢమరుకంతో దర్శనం ఇస్తుంది.

ఇష్టమైన రంగుల:ఆకుపచ్చ,పసుపు,ఎరుపు
ఇష్టమైన పూలు:గన్నేరు,చామంతులు
ఇష్టమైన పూజలు:బోనంతో ముత్తైదువులు హారతి ఇవ్వడం
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,చద్ది.

 

  -తోలేటి వెంకట శిరీష

Leave a comment