Categories
తన పొడవైన కురులతో స్లోవాకియాకు చెందిన అలియా నసిరోవా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. 8 అడుగుల 5.3 అంగుళాల పొడవున్న జుట్టుతో ప్రపంచంలోనే అతి పొడవైన శిరోజాలు ఉన్న మహిళ ఆలియా. రోజు జుట్టు దువ్వుకోలేను వారానికి ఒకసారి దువ్వెందుకు జడ వేసుకునేందుకు గంట పైగా సమయం పడుతుంది. ఇక తల స్నానం చేస్తే తడి ఆరెందుకు 24 గంటలు పడుతుంది అని చెబుతున్నా ఆలియా వృత్తి రీత్యా పెయింటర్ తన పొడవైన జుట్టుతో మోడలింగ్ కూడా చేస్తుంది ఆలియా.