Categories
చూసేందుకు పచ్చగా నిగనిగలాడుతూ కనించినా గరుకుగా తగిలే గుజ్జు ,పులుపు చాలా మంది ఇష్టపడతారు.కానీ పియర్స్ గా పిలిచే వీటిలోని పోషకాలు ,పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం…తోలు కాస్త చిరు చేదుగా ,లోపలి కాయాంత నీటితో నిండి ఉండే పియర్స్ రుచికరం ,ఆరోగ్యం కూడా. మనకు దొరికే ఏషియన్ రకంలో పది గ్రాములు కొలెస్ట్రాల్ తగ్గించే పీచు ఉంటుంది. ఇది దైనందిక అవసరానికి ఉపయోగడే దానిలో 40 శాతం అన్నమాట. కాఫర్ ,ఐరన్ ,పోటాషియం,మెగ్నిషియం ,మాంగనీస్ వంటి ఖనిజాలకు బి-కాంఫ్లెక్స్ విటమిన్లకు పియర్స్ మంచి ఆధారం .ఈ పండ్లు త్వరగా పాడై పోతాయి.కట్ చేసిన ముక్కలపై నిమ్మరసం పిండితే ముక్కలు రంగు మారకుండా రుచిగా ఉంటాయి.