Categories
ఏదైన స్పెషల్ గా కనిపించాలంటే లెహంగా ఎంచుకుంటే చాలు పూజలు,పుట్టిన రోజులు,చిన్నప్పటి అకేషన్స్ ఏదైన సరే చక్కటి వస్త్ర శ్ర్రేణిలో లెహంగా ప్లాన్ చేసుకుని దానిపై బూటీలు,కుచ్చిళ్ళు ఉండేలా డిజైన్ చేసుకుంటే చాలు ఎక్కడలేని అందం అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. కంచిపట్టు బెనారస్ లో లెహంగా పైన మగ్గం వర్క్ చేయించి దానికి జతగా జార్జెట్,సిఫాన్ ఓణిలు చాలా అందంగా మ్యాచ్ అవుతాయి. పరికిణి ఓణి బ్లౌజ్ లు ఒకే రంగులో ఉన్న మూడు మూడు రంగుల్లో ఉన్నా ఫాషనే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్యూర్ రా సిల్క్ లెహంగా పై మగ్గం వర్క్ చేయించి సిఫాన్,జార్జెట్ నెట్ దుపట్టాలు వేసుకుంటె పర్ ఫెక్ట్ గా ఉంటుందంటున్నారు.