ఇల్లు శుభ్రం చేయటం ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి అంగుళాన్ని శ్రద్ధగా గమనించి మరీ క్లీన్ చేయాలి. గదుల్లో ,బీరువాలు,వంటగదిలో అలమార్‌లో,అందంగా హాల్లో వరసగా సర్ధిన పుస్తకాలు వీటన్నింటిపైన దుమ్ము పేరుకుకొంటుంది. కనీసం వారానికి ఒక సారైనా వీటి సంగతి పట్టించుకోవాలి. ప్రిజ్ డోర్ లు, హాండిల్స్, ఎలక్ట్రికల్ స్విచ్ లు అన్నింటిపైన అస్తమానం తాకుతూ ఉంటాం, కనుక బాక్టీరియా పేరుకొంటుంది. మొబైల్స్ స్క్రీన్స్ , రిమోట్ ఇంట్లో అందరూ బయటటి నుంచి రాగానే చేతిలోకి తీసుకొంటారు. చేతులు మారటంతో బాక్టిరియా పెరిగిపోతుంది. డెటాల్ లో ముంచిన తడి బట్టతో తుడవాలి. వాషింగ్ మెషిన్ లు,జిమ్ బ్యాగ్స్ ,సాక్స్,ఎక్సర్ సైజ్ మ్యాట్స్ ,మేకప్ కిట్లు ,దువ్వెనలు బ్రెష్ లు ,టూత్ బ్రెష్ హాల్టర్లు, హాండ్ బ్యాగ్స్ ,అందులతో వస్తువులు మొత్తం వరసగా లిస్ట్ రాపుకొని వారానికి ఒక సారి అన్ని శభ్రం చేసుకొంటేనే ఇల్లు క్లీన్ గా ఉన్నట్లు .

Leave a comment