Categories
ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత్ క్రీడాకారులకు ప్రధాన పోషకాహార నిపుణురాలు ఆరాధనా శర్మ. పూణే కి చెందిన ఆరాధన శర్మ అథ్లెట్స్ కు పోషకాహారాన్ని సూచించే బాధ్యతల్లో ఉన్నారు. క్రీడాకారుల శక్తిసామర్థ్యాలు నైపుణ్యాలు మెరుగ్గా ప్రదర్శించాలంటే పోషకాహారానికే ప్రధాన పాత్ర. బాక్సింగ్, రెజ్లింగ్ మ్యాచ్ ల విరామంలో, రికవరీ కాలంలో అథ్లెట్స్ కు ఎలక్ట్రోలైట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు సమతులంగా అందాలి. మహిళ అథ్లెట్స్ కు హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించే పోషకాహారం ఇవ్వాలి. రుతుక్రమ సమయంలో రక్తహీనతకు గురవకుండా ప్రత్యేకంగా చూసుకోవాలి అంటారు ఆరాధనా శర్మ.