Categories
ఎర్ర గుమ్మడికాయ గింజలు చూసేందుకు పచ్చగా ఉంటాయి . ఈ గింజల్లో ఎన్నో పోషకాలు ఆరోగ్యానికీ అందానికీ కూడా సహరకరిస్తాయి . గింజల్లోని జింక్ జుట్టు ఆరోగ్యాంగా ఉండేందుకు,చర్మం మెరిసేందుకు సహరకరిస్తుంది . కొంతమంది కి జుట్టు ఎర్రబడిపోతూ ఉంటుంది . దానికి కారణం జింక్ లోపం . అలాగే స్రీలకు అవసరమైన ఫైటో ఈ స్ట్రోజెన్లు ఈ గింజల్లో సమృద్ధిగా ఉంటాయి . రోజంతా నిర్విరామంగా పనిచేసిన మెదడు ,ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది హాయిగా నిద్రపట్టాలి అంటే నిద్రపోయే ముందర నాలుగైదు గుమ్మడి గింజలు తినాలి . గింజల్లోని సెరటోనిక్ అనే పదార్థం ,యాంటీ డిప్రసెంట్ గా పనిచేసి ,ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తుంది . వీటిలో తేలిగ్గా జీర్ణం అయ్యే పీచు పుష్కలంగా ఉంటుంది . రోజుకి పదిగింజల వరకు తినవచ్చు .