చాలామందికి మష్రూమ్స్ నచ్చవు గానీ ఇవి అపారమైన పోషక విలువలకు ఆధారం. వీటిల్లో హెపటో ప్రొటెక్టివ్ కార్డియో యాంటీవైరల్ యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కాన్సర్ యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలున్నాయి. కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు తక్కువగా ఫైబర్ పాళ్ళు ఎక్కువగా ప్రోటీన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి . రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటానికి ఈ పోషకాలు ఎంతో ఉపకరిస్తాయి. అర కప్పు ఉడికించిన మష్రూమ్స్ 20 గ్రాముల క్యాలరీలు 1. 7 గ్రాముల ప్రోటీన్స్ 17 గ్రాముల కార్బో హైడ్రేట్స్ 278 మి. గ్రా పొటాషియం 3.5 మి గ్రా నియాసిన్ లభిస్తాయి. మష్రూమ్స్ లో టానిక్స్ ఉంటాయి కానీ ఇవి ఉడికిస్తే పోతాయి. కాబట్టి ఎలాంటి భయం లేకుండా తినచ్చు. ఇది అన్ని రకాల కూరల్లోనూ వేసి వండుకోవచ్చు . చపాతీల్లోకి చేసుకునే మిక్సడ్ వెజిటబుల్స్ లో మష్రూమ్స్ కూడా చేర్చుకుంటే ఇవి కూరలో కలిసిపోయి కనబడకుండా పోతాయి. అంచేత అయిష్టాన్ని పక్కన పెట్టి ఇవి తప్పకుండా తినాలి.
Categories