కేరళ తమిళ నాడుల్లో విస్తృతంగా పెరిగే లవంగ చెట్టు నుంచి తీసే ఎండు మొగ్గ లవంగం. ఒక్క లవంగం నోట్లో వేసుకుంటే ఘాటుగా కారంగా వుండే ఆ రుచి వాసన చాలా బావుంటుంది. ఈ లవంగం ప్రయోజనాల గురించి ఆయుర్వేద గ్రంధాల్లో పెద్ద రెసెర్చే వుంది. ఎనో మందుల కోసం వాడే దినుసుల్లో ఈ లవంగం తప్పకుండా ఉంటుంది. వాతావరణ సంబంధిత విషతుల్యత నివారణలు అమోఘంగా పనిచేసే ఈ లవంగంలో మాంగనీస్ కాల్షియం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కె . సి విటమిన్లతో పాటు పూర్తి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగివుంటాయి. లవంగ నూనె ఎన్నో ఆరోగ్య సమస్యలకు సహజ పరిష్కారం. లవంగ నూనె లో కొద్దిగా దూది ని ముంచి ఉపశమనం కలుగుతుంది. లవంగం పొడితో చిగుళ్లు మసాజ్ చేస్తే వాపునొప్పి దుర్వాసన పోతాయి. నీళ్లతో లవంగాలు వేసి మరిగించి రోజు తగైతే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. డైయాబెటిక్ యాంటీ పాస్మోడిక్. పునరుత్తేజ లక్షణాలు కలిగి ఉంటుంది. దగ్గు ఆస్తమా చికిత్స లో బాగా పనికొస్తుంది.
Categories