Categories
సంక్రాంతి కోనసీమ లో జరిగే ప్రభల తీర్థం చాలా ప్రత్యేకం నాలుగు వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ పండుగలు సుమారు 90 కి పైగా గ్రామాల్లో నుంచి ప్రభలు కట్టే వేడుక జరుగుతుంది. కనుమ రోజున జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు కొలువు తీరతారని ప్రతీతి. ప్రభలన్నీ రుద్ర రూపాలతో తయారవుతాయి. తాటి దూలాలకు టేకు చక్కని వెదురు బొంగుల్ని అమర్చి ప్రభలు నిర్మిస్తారు. నెమలి పింఛాలు పూలదండలు అలంకరణ ప్రత్యేకం మధ్యలో స్థానిక శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచుతారు. వీటిని పరమశివుడి వెంట వుండే వీర భద్రుని ప్రతీకలుగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రభల ఊరేగింపుకు వాహనాలు వాడరు. ఎంత దూరమైనా భుజాలపైన మోస్తారు వ్యాఘ్రేశ్వర నికి చెందిన వ్యాఘ్రేశ్వరస్వామి ఈ కొలువుకు ప్రతేకం.