Categories
2021 సంవత్సరానికి గాను వెరైజాన్ మాస్టర్ ఇన్వెంటర్ అవార్డ్ అందుకున్నారు డాక్టర్ కళ్యాణి భోగినేని. నెట్ వర్క్ టెక్నాలజీ రంగాన్ని ఎంచుకుని అందులో రాణించి 5జి టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం చేసిన వెరైజాన్ కంపెనీల్లో 18 ఏళ్లుగా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నారు కల్యాణీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త సాంకేతికతలను పరిశీలిస్తూ వాటితో కలిగే ప్రయోజనాలను విశ్లేషించి నెట్ వర్క్ కు తగ్గట్టుగా మార్చడం కళ్యాణి చేసే ఉద్యోగం. టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి ఆ వేగాన్ని అందుకోవడం కోసం నిరంతరంగా నేర్చుకుంటూ ఉండాలి చదవటం కొనసాగించాలి అంటారు డాక్టర్ కళ్యాణి భోగినేని.