ప్రకృతిలో ఎన్నో వస్తువులు రేఖా గణితం డిజైన్లలో ఉంటాయి. నత్త గుల్లలు, శంఖువులు ఆకారంలో, తేనె టీగలు కట్టె తేనె పాట్లు, ఆకాసంలో విశ్వంలో గ్రహాలన్నీ, ఇంకా ఎన్నో ఆకారాల్లో కనిపిస్తాయి. ఈవే మన డిజైనర్లను ఆకర్షించి ఉంటాయి. లతలు, పువ్వుల తర్వాత ఇటు నగలు, చీరల డిజైనర్లను ఆకర్షించింది రేఖా గణితపు ఆకరాలే. తెలుపు పైన నలుపు గీతలు, నలుపు పైన తెల్ల గీతల డిజైన్స్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. చీరలు పొడవాటి గౌన్లు, కుర్తీలు, లేగ్గింగ్స్ లో కూడా త్రిబుజాలు ఫ్యాషనైపోతున్నాయి. ఇక డిజిటల్ డిజైన్స్ అంటేనే ఒక ఆకారం అంటూ లేని రంగుల వలయాలు గీతల గమ్మత్తులే చీరాల విషయంలో కాటన్, సిల్క్ , పట్టు, అన్న తీరు లేకుండా అన్నీ గీతలు, సున్నాలు, చతురస్రాలు ఏవో కోణంలో రంగుల్లో వదిగిపోయి ఏ సమయంలో అయినా కట్టుకుట్టుకునేందుకు ఫ్యాషన్ డిజైనర్ల కు పేరు తెస్తూనే వున్నాయి.

Leave a comment