దుస్తుల పైన రకరకాల మరకలు పడతాయి. వాటిని చిటికెలో వదిలించే చిట్కాలున్నాయి. లిప్ స్టిక్ మరకపై నేరుగా హెయిర్ స్ప్రే చేస్తే వెంటనే మరక పోతుంది. నూనె మరక పైన చాక్ పీస్ తో రుద్దితే చాక్ పీస్ నూనె పీల్చుకుంటుంది. ఫౌండేషన్ మరక పైన షేవింగ్ క్రీమ్ కాస్త రుద్దితే చాలు. కాఫీ టీ మరకల ను వెనిగర్ చల్లి ఉతికి ఆరేస్తే పోతాయి. రక్తపు మరకలు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి రుద్దితే చాలు. ఇంక్ మరకలు హాండ్ శానిటైజర్ గానీ ఆల్కహాల్ గానీ వేసి రుద్ది కడిగేస్తే పోతాయి.

Leave a comment