హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్, అసాధారణ కలయిక గల ఏకైక ద్రవ పదార్ధం పాలే. 100 ఎం. ఎజ్ ఆవు పాలలో 3. 2 గ్రాముల ప్రొటెం 4. 1 గ్రాముల ఫ్యాట్ 4. 4 గ్రాముల కార్బోహైడ్రాట్స్ 97 క్యాలరీలు ఉంటాయి. గేదె పాలు వీటికంటే హెవీ. పాలల్లోని ప్రోటీన్ అత్యధిక బయోలాజికల్ విలువలు కలిగి ఉంటుంది. అంటే పూర్తి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. చక్కని గ్రహించే గుణంకలిగిన కాల్షియం  ఉంటుంది.కానీ కొందరికి పాలు అరగకపోవచ్చు. దీనిలోని లాక్టోజ్ వల్ల ఈ అరుగుదల సమస్య వస్తుంది. ఒక కప్పు పాలు లేదా పెరుగు ఒకే  నిస్పృత్తి లో అంటే 180 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. పెద్దలలో కొందరికి మాత్రమే పెరుగు పాలలో వుండే లాక్టోజ్ వల్ల పాలు  సరిపడక పోవచ్చు. కానీ పిల్లలకు హాయిగా పాలు అరిగిపోతాయి. పాలను పెరుగు పనీర్ మజ్జిగ వంటి రూపాల్లో తీసుకున్న సమస్య లేదు. కానీ రోజూ పాలు తాగటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తుంచుకోమంటున్నారు డాక్టర్లు.

Leave a comment