ఈ ప్రపంచం స్త్రీ ల కోసం డిజైన్ చేసింది కాదు. పురుషుల జీవితం పబ్లిక్ గా ,స్త్రీల జీవితం ప్రైవేట్ గా విభజనతో ఉన్నప్పుడు ,కనీస హక్కులు కూడా స్త్రీలు కావాలని అడగకుండా నోరెత్త కుండా అనుభవించన రోజులున్నాయి కానీ ఇవ్వాళ్టి ఆధునిక యువతి అలా ఏ అసౌర్యాన్ని మౌనంగా భరించేందుకు ఎదురిస్తుంది,పోరాడుతోంది,సాధిస్తుంది. అచ్చంగా జవహర్ లాల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న 27 సంవత్సరాల జర్శీనా లాగా ఉంటుంది. జీఎస్టీ పరిధి నుంచి శానీటరీ నాప్ కీన్స్ తోలగించేంత వరకు ఆ అమ్మాయి పోరాడింది. ఢిల్లీ హైకోర్ట్ లో జర్మీనా ప్రజాహిత వ్యాజ్యం వేసింది. సింధూరం ,బోట్టు, కాటుక ,కండోమ్స్ వంటి వస్తువులపై జీఎస్టీ పరిధి నుంచి తొలగించినప్పుడు శానిటరీ న్యాప్ కిన్స్ పై ఈ భారం ఎందుకని ఆమె పిటిషన్ లో అడిగింది. ఒక ఏడాది పాటు విచారణలు జరిగాక ప్రభుత్వం నాప్ కిన్స్ పై జీఎస్టీ రద్దు చేసింది.
Categories