Categories
భారతీయ చారిత్రక నిర్మాణాలకు తన కళాత్మక శక్తి తో కొత్త రూపం ఇస్తుంది తెలంగాణకు చెందిన మసూమా రిజ్వి. రాష్ట్రపతి భవనం నుంచి అయోధ్య రామ మందిరం నిర్మాణం వరకు ఎన్నో కట్టడాలకు ఇంటీరియర్ డెకరేషన్ చేసిందామె ఆర్కిటెక్ట్. ఆర్టిస్ట్ కూడా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఆమె సృష్టే. బెలిటా డిజైన్స్ పేరుతో ఆమె వృత్తి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఆయన భవంతి ఒక వెదురిల్లు నిర్మించి ఆయన ప్రశంసలు పొందింది రిజ్వి. ఆర్ట్ క్యూరేటర్ గా కెరీర్ మొదలు పెట్టిన రిజ్వి ప్రస్తుతం సాంప్రదాయ హస్తకళ పరిరక్షణ కోసం కృషి చేస్తోంది.