జుట్టు రాలిపోవడానికి ప్రతిసారి పోషకాహార లోపమే అనుకోనక్కరలేదు.మనం చేసే పొరపాట్లు కూడా కావచ్చు. తడి జుట్టును ఆరబెట్టేందుకు డ్రయర్ వాడటం స్ట్రైయిటనర్ ఉపయోగించటం కూడా నష్టం  కలగజేస్తోంది.ఈ వాడే సమయంలో వచ్చే వేడి మాడుపై నూనేని,తేమని తగ్గించి జుట్టును పొడిబారేలా చేస్తుంది జుట్టుని  సహజంగా ఎండ పొరలో గాలిలో ఆరనివ్వాలి.వాడే  షాంపూల్లో పి పి డి అమ్మోనియా వంటి రసాయనాలు వెంట్రుకలకు హాని చేస్తాయి.పైగా పీహెచ్ శాతం ఎక్కువ ఉండటం వల్ల జుట్టు పొడిబారి చిట్లిపోతుంది రాలిపోతుంది కూడా.అందుకే గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకోవటం తోపాటు నీళ్లలో కలిపి వాడుకోవటం మేలు. వారంలో మూడు సార్లకు మించి షాంపు వాడకపోవటం బెస్ట్.

Leave a comment