ఇది కరోనా కాలం పెద్దవాళ్ళు ఉద్యోగాలు, పిల్లలు చదువుల పైనా ఈ వైరస్ పెను ప్రభావం చూపించింది. బడికి వెళ్లి నేర్చుకునే విద్య వర్చ్యువల్  తరగతిగా మారిపోయింది.ఈ మార్పును పిల్లలు అర్థం చేసుకోవడం అలవాటు పడటం కాస్త కష్టమే.పిల్లల చదువు కోసం ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజును ఒక టైం టేబుల్ ప్రకారం విభజించుకోవాలి.చదువు, వ్యాయామం, అలవాటు పనులు అన్నింటినీ ఒక పేపర్ పైన ఒక్కదానికి ఇంత సమయం అని కేటాయించుకుని రాసి పెట్టుకోవాలి.ముందుగా సాంప్రదాయ అభ్యాస పద్ధతుల నుంచి బయటకు రావాలి.పాఠ్య శాలలో పిల్లలు ఏ అంశంపైన అభిరుచి చూపిస్తున్నారో టీచర్లు బోధించే పద్ధతి గమనిస్తూ వారికి చదువుకునేందుకు సహాయం చేయాలి.

ReplyReply allForward

Leave a comment