నీహారికా, నిన్నటి రోజు నువ్వు ట్రాఫిక్ లో అతివేగంగా కార్లు, ఇతర వాహనాలు తప్పిస్తూ బైక్ పైన రావడం చూశాను. ఇంత రద్దీలో నువ్వు నీ ప్రాణం, ఇతరుల ప్రాణం గురించి ఏమాత్రం లక్ష్యం లేకుండా ఎలా రెడ్ సిగ్నల్ దగ్గర జంప్ చేస్తూ వస్తున్నావో కూడా చూశాను. రహదారి పైన కాస్తయినా సంయమనంతో వ్యవహరించవా? నీలాంటి యువతే కార్లో వెళుతూ సీట్ బెల్ట్ పెట్టుకోరు, ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నా లక్ష్య పెట్టరు. ట్రాఫిక్ ఎక్కువగా వుంటే ఫుట్ పాత్ ఎక్కించి కూడా దూసుకెళతారు. బస్సులు, కార్ల మధ్యలోంచి వెళ్తుంటారు అవి ఉన్నట్లుండి కదిలితే కుడి వైపు అవకాశం లేకపోతే ఎడమవైపు వెళతారు. గ్రీన్ పడేలోపుగానే విపరీతమైన సౌండ్ తో హారన్ మొగించేస్తూ అవతలి వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తారు. ముందున్న వాహనం సైడ్ ఇచ్చేవరకు విసిగించేస్తారు. ఇక హెల్మెట్ సంగతి దేవుడెరుగు. అర్ధరాత్రి వేళ టర్నింగ్స్, డేంజర్ స్పాట్స్ చూసుకోకుండా విపరీతమైన వేగంతో నడుపుతూ ప్రాణాల పైకి తెచ్చుకునే పద్ధతి సరైనదే అంటావా? సేఫ్ గా ప్రయాణం చేయాలని నిశ్చయించుకోవాలి. మన ప్రాణాలతో పాటుఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా విలువైనవే విషయం మరవకూడదు. రోడ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీగా పాటించు.
Categories