నీహారికా ,
వందలో ఒక్కరుగా ఉండాలని ఉంటుంది కానీ ఎంతో మందిలో కలిసిపోయి గూటింపు లేకుండా బతకటం నాకు ఇష్టం ఉండదు అన్నావు నిజమే. అసలు మూసలో కొట్టుకుపోవడం తో సగం వైఫల్యం వుందంటాడు న్యూటన్. సవాళ్లకు ఎదుర్కొనిలేని వాళ్ళ నలుగురు నడిచే బాటలో నడుస్తారు. ఇవాళ్టి పోటీ ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంటు విజయం సాధించాలంటే కొత్త అవకాశాలు పసిగట్టగల నేర్పు ప్రణాళికా రూపకల్పన సామర్ధ్యం నిర్ణయాలు సత్వరం తీసుకోగలిగే చురుకుతనం మన ఆలోచనలు ఇతరులు పసిగట్టలేనంత తెలివి తేటలు కావాలి. వంద శాతం గురించి ఆలోచించే చోట వెయ్యి శాతం గురించి మాట్లాడే ధైర్యం కావాలి. విజ్జయం ఎప్పుడూ ప్రవహించే నది లాంటిది. ఇవ్వాళ తో కొంత పూర్తీ చేసాం ఇంకా రెస్ట్ తీసుకుందాం అనే తృప్తి ఇక్కడ చాలదు. తుదివరకు శ్రమిస్తూ ఆలోచనలకు పదును పెడుతూ కొత్త కొత్త రంగాల్లో అడుగుపెడుతూ సవాళ్ళను ఎదుర్కొంటు ఉండాలి. మన విజయం విస్తరించి పదిమందితో పోటీలో గుర్తింపు రావాలంటే ఎదో కొత్తదనం అన్వేషిస్తూనే ఉండాలి. అప్పుడిక వందలో ఒక్కరిగా కాదు ఒకే ఒక్కళ్లుగా కూడా ఉండొచ్చు. అలంటి శక్తి యుక్తులు సంపాదిస్తే ఎంతోమంది నీవెంటే ఉంటారు నీ ప్రత్యేకతను వప్పుకుంటారు.