నీహారికా ,
ప్రతిదానికీ ఒక సమయం ఉంటుందా ? ఒకప్పుడు విజయవంతంగా చేసిన పని ఇంకోసారి ఎందుకు చేయలేము అని అడిగావు కరెక్టే. చిన్న లాజిక్ విను మనిషి జీవితంలో మూడు దశలుంటాయి. యవ్వనం కౌముదం వార్ధక్యం . యవ్వనంలో పుష్కాలమంతా శక్తీ సమయం ఉంటాయి. డబ్బు ఇంకా సంపాదించవలసిన సమయం ఇది. అంటే డబ్బు ఉండదు. ఇక రెండో కౌముదం 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు. డబ్బు సంపాదిస్తారు శక్తీ ఉంటుంది దాన్ని అనుభవించే సమయం ఉండదు. ఇక మూడోది వార్ధక్యం ఇప్పుడు డబ్బు సమయం ఉంటుంది ఓపిక ఉండదు. పై మూడు దశల్లో డబ్బు వయస్సు శక్తీ మూడు ముఖ్యాంశాలు. ఇప్పుడు వయసులో డబ్బు సంపాదించి కౌముద దశలో కాస్త సమయం మిగుల్చుకుని డబ్బు జీవితం కూడా అనుభవించాలి. వార్ధక్యంలో ఆ డబ్బుతో మిగిలిన జ్ఞాపకాలు అనుభవాలతో సుఖంగా బతకండి అంటాం. అంచేత ఒక్కో సమయంలో చేయవలిసిన పని అప్పుడే చేయాలి. 70 ఏళ్ళు వచ్చాక వ్యాపారం మొదలెడతాననటం కరెక్టా ?? ఇప్పుడు చెప్పు ప్రతిదానికీ సమయం సందర్భం ఉంటాయా ? ఉండవా ? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని సక్రమంగా ఆ పని ముగించాలి. ఏమంటావు ??