Categories
పిండిని రొట్ట గా మార్చే వి, పాలు పెరుగుగా మార్చే వి కంటికి కనిపించని సూక్ష్మజీవులు అలాటి రెండు వందల రకాల కొత్త బ్యాక్టీరియాలను కనిపెట్టారు హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ సి హెచ్ శశికళ. JNTU లో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ బ్యాక్టీరియల్ డిస్కవరీ లాబరేటరీ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. విశ్వవిద్యాలయం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆమె చేసే పరిశోధనలు ఆమెను ప్రతిష్ఠాత్మకమైన జనకా అమ్మాళ్ నేషనల్ అవార్డ్ కు ఎంపిక చేశాయి. ఆక్యుపంచర్ లో మందుల గా ఉపయోగపడే సూక్ష్మజీవులను కూడా గుర్తించారు ప్రొఫెసర్ శశికళ .