
వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో, రక్త పోటు తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన విశేషం ఇది సహజమైన వయాగ్రా. పుచ్చకాయలోని సిట్రల్లినో ఎమినో యాసిడ్ బ్లడ్ ఫ్లోను మెరుగు పరుస్తుంది. సిట్రల్లినోను మన శరీరం ఉపయోగించుకుని ఆర్గినైన్ అనే మరో ఎమినో యాసిడ్ రూపొందించటానికి పుచ్చకాయ సహకరిస్తుంది. దీనికి వయగ్రా ప్రభావం వుంది. రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది. వయాగ్రాకు ఇదే ప్రాధమిక స్వభావం వుంటుంది. 90 శాతం నీరుండే ఈ జ్యూసీ పండులో ఎనిమిది శాతం చక్కెర వుంటుంది. విటమిన్-c అధికంగా వుంటుంది. ఒక్క సెర్వింగ్ కు 71 క్యాలరీలు మాత్రం ఉంటాయి.