Categories
నా సినీ కెరీర్ పూలపాన్పు మాత్రం కాదు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేకమంది బాడీ షేమింగ్ చేశారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్త లో బొద్దుగా ఉన్నానని గ్యాస్ టాంకర్ అని వెక్కిరించారు. అందుకు నా అనారోగ్య సమస్యలే కారణం పి.సి.ఓ.డి(PCOD) నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అంటోంది రాశిఖన్నా. ఎన్నో కఠినమైన వ్యాయామాలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొన్నాక ఇప్పుడు బరువు తగ్గి పోయాను అని చెబుతున్నా రాశిఖన్నా ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది.