ఎదిగే వయసు పిల్లలకు నెయ్యి ఆహరంలో ఇవ్వటం చాలా మంచిది ,ఆరోగ్యం అంటోంది డైటీషియన్ రుజుతా. మనిషి మెదడు 60 శాతం కొవ్వులతో తయారైంది. అది మనం రోజూ తినే ఆహారంలో కొవ్వులనే గ్రహిస్తుంది. కొవ్వు కొంత స్థాయిలో శరీరంలోకి వెళితే మంచిదే అంటారు రుజుతా. నట్స్ బీజ్,ఆలివ్ ఆయిల్ ,అవకాడోస్, వెన్న మంచి కొవ్వులు అంటారు. మెదడు చక్కగా పనిచేయాలి అంటే ఈ సంతృప్త కొవ్వులు చాలా అవసరం. ఆరునెలల వయసు నుంచి పిల్లలకు పెట్టే కిచిడిలో తక్కువ పరిమాణంలో నెయ్యి వేసి తినిపించాలి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది. ఎముకలు బలంగా పెరుగుతాయి.జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది కూడా.

Leave a comment