Categories
శరీరపు రంగుతో పోలిస్తే మోచేతులు ,మోకాళ్ల వల్ల చర్మం కాస్త నల్లగా ఉంటుంది. ఈ నలుపు కొన్ని ప్యాక్స్ తో పోగొట్టవచ్చు. అలావేరా గుజ్జు ప్రతి రోజు అప్లైయ్ చేయటం వల్ల మోచేతులు ,మోకాళ్ళు తెల్లగా అయిపోతాయి. పసుపు తేనె ,పాలు కలపిన ఫ్యాక్ కూడా బాగా పనిచేస్తుంది. వారంలో రెండు సార్లు వేస్తే బావుంటుంది. ఆలివ్ ఆయిల్ పంచదారా కలిపి నలుపు ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఇక నిమ్మరసం బ్లీచింగ్ పజెంట్ లాగే పని చేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో దూదిని ముంచి నలుపుగా ఉన్న ప్రాంతంలో రుద్దితే చాలు నలుపు విరిగిపోతుంది. అలాగే ముఖానికి వాడే సన్ స్క్రీన్ ప్రతి రోజు మోకాళ్ళు మోచేతుల పైన రాస్తే ఈ నలుపు పోతుంది.