ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి. సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ హీరొయిన్స్ కు దక్కనట్లే. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఎవరో అడగాలి కదా. సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఖాన్ ఫాస్ట్ మూవీ కేదార్నాథ్ ఇంకా రిలీజ్ అవలేదు. ఈ మూవీ ని అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేసారు. నిర్మాత కుడా ఆయనే. ఆ సినిమాకు సారా ఎంత తీసుకుందో బయటకి చెప్పలేదు. కానీ కొత్త సినిమా కోసం తన అప్రోచ్ అయిన నిర్మాతలకు సారా హీరో తో పాటు సమానంగా ఇస్తేనే అని చెప్పిందట . నలుగురికీ నువ్వు తెలియాలి, నీకు పేరు రావాలి అప్పుడే ఇంతంత రెమ్యునరేషన్ ఇవ్వగలమా? అసలు అంతంత డబ్బు అడగడం నీకు భావ్యమా అని నిర్మాత మొత్తుకున్నా సారా ఖాన్ మాటుకు నేనింతేననేసిందిట. కొత్తయినా, పాతయినా యాక్షన్ చేయాల్సిందే కదా’. నాపైన నీకు నమ్మకం, మీకు నమ్మకం ఉంటేనే నాతో సినిమా అనేసిన సారాని సీనియర్స్ చాలా మెచ్చేసుకోన్నారట.

Leave a comment