Categories
ఏళ్ళతరబడి కళ్ళకు కాటుక పెట్టుకుంటూ ఉన్నా,లేదా వయసుతోపాటు వచ్చే మడతలు కళ్ళకింద వచ్చినా కళ్ళ కింద నల్లని వలయాలు కనిపిస్తాయి.ఇవి నిద్రలేమి వల్లనో అలర్జీలు,రక్తహీనత వల్ల కూడా రావచ్చు.కళ్ళ కింద ఉండే సున్నితమైన చర్మం చేత్తో రుద్దటం వల్ల కూడా నల్లని వలయాలు వస్తాయి.కళ్ళ చుట్టూ చల్లని కీర ముక్కలను ఉంచి ఐదు నిమిషాలు విశ్రాంతి గా కళ్ళు మూసుకోని ఉండాలి. ఆ మొక్కలతో కళ్ల చుట్టూ మృదువుగా రాయాలి.అలాగే బంగాళాదుంప రసం కళ్ళకింద రాసి ఐదు నిమిషాలు ఆరిపోయే వరకూ ఉంచాలి.బాదం నూనెలో నిమ్మరసం కలిపి కళ్ల కింద రాయచ్చు.ఇలాటి ఇంటి వైద్యులతో కళ్లు తెరుకుంటాయి అలసట పోతుంది. అలాగే నల్లని వలయాలు కూడా మాయం అవుతాయి.