Categories
మొట్టమొదటి క్వారంటైన్ బర్త్ కేస్ ను కార్గల్ లో నమోదు చేశారు కరోనా నేపధ్యంలో కార్గిల్ లో ఓ కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్ చేశారు. ఆ ఇంట్లో 30 జహ్రాబాను నిండు చూలాలు. ఆమె సోదరుడికి కరోనా పాజిటివ్ రావటం తో ఆ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. ఇంతలో జహ్రా కు పురుటి నొప్పులు రావటంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మర్చి 28 వ తేదీన మగబిడ్డ పుట్టాడు,ఇది దేశంలోనే తోలి క్వారంటైన్ బర్త్ కేస్ గా నమోదు చేశారు. కుటుంబం మొత్తం క్వారంటైన్ లో ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది పసివాడిని చూసుకొన్నారు. ఇంకో కొసమెరుపు జహ్రా ని కాన్పు చేసిన డాక్టర్ పేరు కూడా జహ్రాబాను నే.