కొత్తగా చీర కట్టాలి అనుకునే అమ్మయిలు కొన్ని కొత్త ఫ్యాషన్స్ ఎంచుకుంటే చక్కగా ఉంటాయి. ముందుగా సన్నని జరీ అంచుతో పట్టు లేదా జార్జెట్ వస్త్ర శ్రేణిలో ధోతి ఎంచుకుని ఆధునికంగా కనిపించాలంటే స్లీవ్ లెస్ ను ఆఫ్ షోల్డర్ బ్రౌజ్‌ ను ఎంచుకొవాలి. ఇక నేరుగా చీర కొనాలంటే పట్టు ఆర్గంజా కోరా రకాలు బావుంటాయి. కడ్డి అంచు ఫ్యాషన్ బ్లవుజ్ అయితే బోట్ నెక్ ఆఫ్ షోల్డర్‌, కోల్డ్ షోల్డర్ ఉండేలా చూసుకోవాలి. చీర సింపుల్ గా చాలా తక్కువ డిజైన్ లో ఉండాలి. లేదా సాదా చీరె లేదా కొంత ఆడంబరంగా కనిపించే బ్లవుజ్ బావుంటుంది. ఇక సాంప్రదాయ వేడుకలకు అయితే మోచేతుల వరకు బ్లౌజ్ మెగా స్లీవ్స్ బుట్ట చేతులు బావుంటాయి.

Leave a comment