బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్,నాలుగు నెలలుగా విండ్సర్ క్యాస్ట్లీలో లాక్ డౌన్ లో ఉన్నారు. ఆమె ఒంటరిగా దిగులు గా ఉందేమోనన్ని ఆలోచనలో తిమోతీ మ్యాడర్స్ అనే ఏడేళ్ల పిల్లవాడు ఆమెను ఉల్లాస పరిచే హ్యాపీ వర్డ్ పజిల్ ను స్వయంగా కనిపెట్టి ఆమెకు పెద్ద వాళ్ల ద్వారా కానుకగా పంపాడు. ఈ పజిల్ పూర్తి చేస్తున్నంతసేపు  మనసుని సంతోష పెట్టే పదాలు వెతుక్కుంటూ ఉండాలి. 94 ఏళ్ళ వయసు లోనే రాణిగారి సంతోషం గురించి లోకం పోకడ ఎరుగని ఏడేళ్ల పసివాడు ఆలోచించడం రాణి గారికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ‘ఎంత బాగా ఆలోచించావు, నువ్వు ఎంత మంచి వాడివి’ అంటూ రాణి గారు తిమోతికి లెటర్ పంపించారు.

Leave a comment