ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది.ఈ సంవత్సరం మన దేశం నుంచి ఐదుగురు మహిళలు ఈ జాబితాలో ఉన్నారు అందులో జోహో కార్ప్ అనే సాఫ్ట్ వేర్ సంస్థకు చెందిన రాధా వేంబు కూడా ఒకరు.ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తితో ఆమె ఆ కంపెనీలో పెద్ద వాటాదారు.ఈ కంపెనీని రాధా వేంబు సోదరుడు శ్రీథర్ వేంబు1996లో స్థాపించారు. వేంబు ఈ-మెయిల్ సర్వీస్, జోహో మెయిల్‌లకు ప్రొడక్ట్ మేనేజర్‌గా, కార్పస్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.48 సంవత్సరాల రాధా వేంబు భారతదేశపు మహిళ శ్రీ మంత్రుల్లో ఒకరుగా ఉన్నారు.